భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా:అశ్వారావుపేట మండలం నారవారిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ ఆధునిక పద్ధతిలో నాణ్యమైన విత్తనాలు నాటే కార్యక్రమం, రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగామయిదయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంట రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే పంట అని శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యమైన విత్తనాలతో సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు. మార్కెటింగ్ ప్రాసెసింగ్ సదుపాయాలను విస్తరించి రైతులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ఈ రోజు నాటుతున్న ప్రతి విత్తనం రైతు భవిష్యత్తుకు ఆశాకిరణమని ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు ఉపాధి ఆదాయం ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రంలో మోడల్ జిల్లాగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ చందా రాఘవరెడ్డి, ఎండి శంకరయ్య, ఆలపాటి రామచంద్రప్రసాద్, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, దమ్మపేట సొసైటీ అధ్యక్షులు యెళ్లిన రాఘవరావు, వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్, రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయిల్ ఫామ్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
18, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్