భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

27న జిల్లా వ్యాప్తంగా రహదారులపై రాస్తారోకో

20

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచాయి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక ఉపముఖ్యమంత్రితో పాటు మొత్తంగా ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు ఒరిగింది మాత్రం శూన్యం అని భద్రాద్రి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ “జిల్లాలోని రహదారులు మరణాలకు మార్గాలుగా మారినాయి. రహదారులపై ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంటలు ఏర్పడి సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న గాని స్థానికంగా ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గానీ నిమ్మకు నీరు ఎత్తనట్లు వ్యవహరించడం వారి చేతగానితనానికి నిదర్శనం. జిల్లాలోని అన్ని రహదారులను తక్షణమే బాగు చేయాలని సామాన్య ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. దానిలో భాగంగా అక్టోబర్ 27న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు అందరూ.. రోడ్లపై ఎక్కడ గుంటలు ఉంటే అక్కడే బైఠాయించి, రాస్తారోకో నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాను. కావున జిల్లాలోని మాజీ శాసనసభ్యులు, అన్ని మండలాల అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, PACS అధ్యక్షులు,మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, విద్యార్ది & యువజన నాయకులు, SC,ST,BC & మైనార్టీ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ఉద్యమకారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడి వారక్కడే ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అన్ని అన్నారు.