భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఈ వారం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్

current-affairs-2024

భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

1. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారత్ ఎన్నిక: 2026–2028 కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా భారత్ ఏడోసారి ఎన్నికైంది. (UNHRC ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది.)
2. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల: ఈ ఇండెక్స్ ప్రకారం, సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అగ్రస్థానంలో నిలిచింది.
3. భారతదేశ ర్యాంక్ (హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్): హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్- 2025లో భారతదేశ ర్యాంక్  85వ స్థానంలో ఉంది.
4. కపాస్ క్రాంతి మిషన్ (Kapas Kranti Mission): కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల వ్యయంతో ఈ మిషన్‌ను ప్రారంభించింది. అధిక-దిగుబడి పత్తి సాగు, సాంకేతికతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.
5. ప్రపంచ ఎముకల వ్యాధి దినోత్సవం (World Osteoporosis Day): ప్రతి సంవత్సరం అక్టోబర్ 20 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు, బోలు ఎముకల వ్యాధి గురించి అవగాహన కల్పించడం దీని ఉద్దేశం.
6. FSSAI నుంచి ‘ORS’ లేబుల్‌పై నిషేధం: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహార ఉత్పత్తులపై ‘ORS’ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) అనే పదాన్ని ఉపయోగించకుండా నిషేధించింది.
7. తువాలు IUCNలో చేరిక: తువాలు దేశం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) లో 90వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది.
8. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) ఒప్పందం: ADB, ప్రపంచ బ్యాంకుతో కీలకమైన మూడు బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది.
9. స్వదేశీ యాంటీబయాటిక్ ఆవిష్కరణ: భారత బయోటెక్నాలజీ విభాగం, వోక్హార్డ్ అభివృద్ధి చేసిన‌ స్వదేశీ యాంటీబయాటిక్ (నాఫిత్రోమైసిన్ అమికాసిన్) వార్తల్లో నిలిచింది.
10. IEA అంచనా (సుస్థిర ఇంధనాలు): ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకారం, ప్రస్తుత విధానాల అమలుతో 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుస్థిర ఇంధనాల వినియోగం నాలుగు రెట్లు పెరగవచ్చు.
11. తెలంగాణలో కొత్త చట్టాలు: తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను, ఆటలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘తెలంగాణ క్రీడా చట్టం-2025’కు ఆమోదం లభించింది.
12. భారత్‌కు కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం: కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే హక్కును భారతదేశం రెండోసారి దక్కించుకుంది (సమయం ఇంకా ఖరారు కాలేదు).
13. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలు: మార్కండ నది కాలుష్యంపై వివరణాత్మక నివేదికలు సమర్పించాలని హిమాచల్ ప్రదేశ్, హర్యానా కాలుష్య నియంత్రణ బోర్డులను NGT ఆదేశించింది.
14. ఢిల్లీ వాయు కాలుష్యంపై GRAP 2 అమలు: దీపావళికి ముందు వాయు నాణ్యత క్షీణించిన కారణంగా ఢిల్లీ ప్రభుత్వం GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) 2 స్థాయి చర్యలను అమలు చేయడం మొదలుపెట్టింది.
15. అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త పుష్పజాతి ఆవిష్కరణ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త ‘బాల్సమ్’ (Balsam) పుష్పజాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
16. డిజిటల్ చెల్లింపుల వృద్ధి: పండుగల సీజన్‌లో ఫుడ్ ఆర్డర్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌లలో డిజిటల్ చెల్లింపుల ద్వారా రికార్డు స్థాయి డిమాండ్‌ను భారతదేశం నమోదు చేసింది.
27. ఉక్రెయిన్-అమెరికా సహాయం: ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశంలో తమ దేశ రక్షణ కోసం Tomahawk క్షిపణి సహాయాన్ని కోరారు.