భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

కొమరం భీమ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

39

భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్ నందు కొమరం భీమ్ జయంతి సందర్భంగా విప్లవ వీరుడు కొమరం భీం విగ్రహానికి పినపాక శాసనసభ్యులు  వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక, విప్లవ వీరుడు కొమురం భీమ్. అడ‌వి బిడ్డ‌ల ఘీంకార స్వ‌రం ఆయ‌న అని,ఆదివాసుల స్వ‌యం ప్ర‌తిప‌త్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్య‌మ‌బావుట, దేశానికి స్వాతంత్రం రాకముందే ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరు తలపెట్టిన పోరాట యోధుడు కోమరం భీం అని ఈ సందర్భంగా తెలియపరిచారు.పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించరు. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాలుగా నిజాం అరాచక ప్రభుత్వాన్ని,అధికారాలను ఎదిరించాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించిన యోధుడినీ ఇలా స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది అని తెలియపరిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, పినపాక నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్య, మైనారిటీ అధ్యక్షులు రహీం భాషా, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

నేడు పినపాక పీహెచ్సీలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌: డాక్టర్ దుర్గాభవాని