భారత్ సమాచార్.నెట్, పశ్చిమ గోదావరి జిల్లా : కార్తీక మాసం మొదటి రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి నదీ తీరాలు భక్తుల శివ నామ స్మరణలతో మార్మోగిపోతున్నాయి. పుణ్య స్నానాలు ఆచరించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు, ముఖ్యంగా మహిళలు, నదీ తీరానికి భారీ సంఖ్యలో పోటెత్తారు. కార్తీక మాసంలో నదీ స్నానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. నదీలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం, భక్తులు గోదావరి ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత కార్తీక దీపాలను వెలిగించి, వాటిని నదీలో వదులుతున్నారు. కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలితే సకల పాపాలు పోయి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని కథనాలు :
రూ.1.75 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత