భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

నాగుల చవితి వేడుకల్లో మంత్రి అచ్చం నాయుడు

8

భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: కోటబొమ్మలి మండలం మంత్రి అచ్చం నాయుడు స్వగ్రామంలో నాగుల చ‌వితి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ప్ర‌జ‌లకు శుభాలు క‌ల‌గాల‌ని ఆశిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజలందరూ ప్ర‌కృతితో మమేకం అవుతూ ప్ర‌కృతిని ప‌రిర‌క్షించాల‌ని కోరారు. ప్రతిఒక్కరికి ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని కోరుకుంటూ ఈ పర్వదినం సందర్భంగా జిల్లాకు సర్వతోముఖాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్, కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

సామాజిక సంస్కరణలతో నరసింగపల్లి స్ఫూర్తి..