భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మోపిదేవి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

WhatsApp Image 2025-10-25 at 8.43.40 PM

భారత్ సమాచార్.నెట్, కృష్ణా: నాగుల చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ చిలకలపూడి పాపారావుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రాం సహా పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు నమోదు