భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

పేదల గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

WhatsApp Image 2025-10-25 at 8.45.07 PM

భారత్ సమాచార్.నెట్, కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు కృషి చేయాలన్నారు.

శనివారం తన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), అవనిగడ్డ ఇంఛార్జి డీఈఈ ఎస్. వెంకట్రావుతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్థలాలు కలిగి ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న 2,198 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు ఈఈ తెలిపారు. వీరంతా నవంబర్ 5వ తేదీలోపు గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

మోపిదేవి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు