భారత్ సమాచార్.నెట్, ఖమ్మం: సత్తుపల్లి పట్టణ శివారు ప్రాంతంలో ఆదివారం రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డు వచ్చిన వీధి కుక్కలను తప్పించేందుకు వేగంగా ప్రయత్నించిన స్కూటీ అదుపు కోల్పోయింది. నియంత్రణ తప్పిన స్కూటీ నేరుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ లారీ కిందకు దూసుకెళ్లడంతో మోరంపూడి స్వర్ణలత (55) అనే మహిళ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని కథనాలు
కుటుంబ కలహాలతో కుమారులకు పురుగుమందు తాగించిన తల్లి