భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి

13

భారత్ సమాచార్.నెట్, అమరావతి: మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకాశం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని, అధికారుల ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి కోరారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఒక్కో కుటుంబానికి రూ.3వేలు సాయం: సీఎం