భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవరకొండ డివిజన్ పరిధిలోని శేరిపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. శేరిపల్లి వాగు ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ వాగుదాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచించారు.
మరిన్ని కథనాలు:
నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ డీఎస్పీగా ఎంపిక