భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగనుంది. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి ల్యాండ్ అవనున్నారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
మరిన్ని కథనాలు:
‘షి ఆటో’ డ్రైవర్‌తో మంత్రి లోకేష్ ఆత్మీయ సంభాషణ