భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.
కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..
రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
మరిన్ని కథనాలు:
ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి