భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత

8

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ ఎదురైంది. కాలె యాదయ్య పైకి రాళ్లు రువ్వుతూ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు ప్రజలు నినాదాలు చేసారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుండి తొలగించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ప్రమాద స్థలం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్ళిపోయారు.

మరిన్ని కథనాలు: 

ఇసుక రవాణాతో భద్రాచలం రహదారి విధ్వంసం అవుతుంది: CPIML మాస్ లైన్