భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: ఝరాసంగం మండలం కక్కర్ వాడా గ్రామంలో కలకలం రేగింది. పది రోజుల క్రితం వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికులు పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు సోమవారం అబ్బాయి ఇంటిపై దాడి చేసి, కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పక్కనే ఉన్న రేకుల షెడ్‌లోని పత్తికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు
రివాల్వర్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య