భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు మూసివేయాలన్న తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపుతో ఉమ్మడి జిల్లా పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. పత్తి కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో, ఈ నెల 6వ తేదీ నుంచి మిల్లులను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న ‘ఎల్1, ఎల్2, ఎల్3’ కేటగిరీల విధానం తమకు ఇబ్బందికరంగా ఉందని, ఆ నిబంధనలను తక్షణమే ఎత్తివేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. భైంసా జిన్నింగ్ అసోసియేషన్ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. మిల్లుల బంద్ కారణంగా మద్దతు ధరకు పత్తి విక్రయాలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.