భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్ స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ
“పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థులను దోపిడీ చేయడం చాలా దారుణం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు ₹125 మాత్రమే ఉండగా, ఈ స్కూల్లో ప్రతి విద్యార్థి నుండి ₹800 వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు” అని అన్నారు.
వనపర్తి మండల విద్యాధికారి కే. మద్దిలేటి ని ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి పిలవడం జరిగింది. వారు స్వయంగా స్కూల్ వద్దకు వచ్చి విద్యార్థులను కలిసి వాస్తవాలు తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్‌ను పిలిచి అధిక ఫీజులు వసూలు చేసిన విషయంపై లేఖ రాయించుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాలలో స్కూల్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని MEO గారు స్కూల్ ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు. MEO ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నందు, సంతోష్, ఇతరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
13, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్