భారత్ సమాచార్, అనంతపురం జిల్లా: హిందూపురం పార్లమెంట్ పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు, కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ, రాప్తాడు అబ్జర్వర్, ఆదోని టీడీపీ మాజీ ఇంఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు అంజనప్ప హాజరయ్యారు. శ్రేణులను ఉద్దేశించి గుడిసె అది క్రిష్ణమ్మ మాట్లాడుతూ… “బూత్ స్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి,” అని పిలుపునిచ్చారు.
BHARATH SAMACHAR DIGITAL
14, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్