భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: లోక్ షాహిర్,సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.శుక్రవారం బైంసా పట్టణంలో ఐబీ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు బీజేపీ నాయకులు అన్నాభావు సాఠే విగ్రహ కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అన్నాభావు సాఠే విగ్రహవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.అన్నాభావు సాఠే కష్టపడి విద్యాజ్ఞానాన్ని ఆర్జించి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన కవి,సాహితీవేత్తగా గుర్తింపు పొందారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి బలహీనవర్గాల్లో చైతన్యం కోసం పాటుపడారని కొనియాడారు.అన్నాభావు సాఠేను అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్,మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
15, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్