భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ న్యూ క్లాసిక్ గార్డెన్లో బాల్య వివాహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఐసిడిసి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. అమ్మాయి,అబ్బాయి కుటుంబీకులను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన మైనర్ బాలికను సాదుల్ నగర్ గ్రామానికి చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తున్నారని సమాచారం రావడంతో వివాహాన్ని అడ్డుకున్నామని, బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని ఐసిడిసి అధికారులు, పోలీసులు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
16, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్