భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గత ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీలో పట్టణ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన యువకులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ కండువాను కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జండా ఎగరవేస్తామన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
16, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్