భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండలం రాగడప గ్రామంలోని ఐకేపీ సెంటర్ను నాగార్జునసాగర్ స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళార్లకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్వహించే ఐకేపి కేంద్రాలలో, వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకొని గిట్టుబాటు ధరతోపాటు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ కూడా పొందాలని సూచించారు. అలాగే ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, వారికి అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ముడిమళ్ళ బుచ్చిరెడ్డి, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మ, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ నిర్వాహకులు, రైతుసంఘం నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
17, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్