భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

నాగార్జునసాగర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

WhatsApp Image 2025-11-17 at 3.17.17 PM

భారత్ సమాచార్.నెట్, నల్గొండ: నాగార్జునసాగర్ జలాశయంలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిండు కుండలా తొణికిసలాడుతున్న సాగర్ ప్రాజెక్టులో ఆయన వివిధ రకాల జాతుల చేప పిల్లలను వదిలిపెట్టారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి, జల వనరుల పెంపునకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి స్థానిక ప్రజలు, ముదిరాజ్ కులస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ పట్టణ ప్రజలు, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.