భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

WhatsApp Image 2025-11-17 at 7.34.21 PM

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని 11 కేవీ నేతాజీ మార్కెట్ ఫీడర్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. ఫీడర్ పరిధిలో చెట్లు నరికే కార్యక్రమం చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ ఉండదు. చిన్న బజార్, పెద్ద బజార్, నేతాజీ మార్కెట్, గొల్లగూడెం, మేదర బస్తి, లెనిన్ నగర్ ఏరియాల్లో కరెంటు ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించి, విద్యుత్ శాఖ సిబ్బందికి మద్దతు ఇవ్వాలని కోరారు.