భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

801da7b5-0b3a-4d9e-ab2b-ed187854e527

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అనాథగా చివరి ప్రయాణం కూడా ఒంటరిగా అయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తనే కుటుంబ సభ్యుడిలా మారి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.  పటాన్‌చెరు మండలంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయిన అతనికి సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో ఆస్పత్రి నుంచి స్వయంగా తీసుకెళ్లి సంప్రదాయ బద్దమైన కర్మకాండలు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు మాదిరి ప్రిథ్వీరాజ్ ఆర్థిక సహకారం అందించారు. సమాజంలో తమ పని, తమ జీవితాలకే పరిమితమైపోయే ఈ రోజుల్లో ఇతరుల కోసం ఇలా ముందుకు వచ్చి చేయూతనిచ్చే మనుషులు చాలా అరుదు. MDR ఫౌండేషన్ చేసే సేవా భావం, కరుణ, మానవత్వం ప్రతీ ఒక్కరికి ప్రేరణ. ఇలాంటి సేవలు సమాజాన్ని మరింత ఉన్నతంగా మార్చుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.