భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: ఐటీడీఏ భద్రాచలం జోనల్ స్థాయి గిరిజన క్రీడలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే చల్ల వెంకట్రావు, అశ్వర్రావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గిరిజన పాఠశాలల్లో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం సాఫ్ట్బాల్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటి నూతన క్రీడలను ప్రారంభించనున్నట్లు పీవో రాహుల్ తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్ర స్థాయి సాయి క్రీడల్లో పాల్గొనేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు పాఠశాల దశ నుంచే క్రీడా సాధనను బలపరచి దేశ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అనంతరం అతిథులు బాలక్రీడలను, సంప్రదాయ విలువిద్యా క్రీడలను ప్రారంభించారు. ఖమ్మం, వైరా, మణుగూరు సహా ఏడు జోన్ల విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.