భారత్ సమాచార్.నెట్, నంద్యాల: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం బేతంచెర్ల మండలం, ఎంబాయి గ్రామ అంగన్వాడీ కేంద్రం–2ను ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలోని సౌకర్యాలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై ఆమె సమగ్రంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ లోపాలను గుర్తించి సిబ్బందిని నిలదీశారు. పిల్లల హాజరు, ఆరోగ్య–వికాస వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న కలెక్టర్, అంగన్వాడీ సేవలను మరింత నాణ్యతతో అందించాలని, పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి గట్టి సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ తమ గ్రామాన్ని సందర్శించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్