భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

మిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

WhatsApp Image 2025-11-19 at 9.22.59 PM

భారత్ సమాచార్.నెట్, నల్గొండ: భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, మిర్యాలగూడ పట్టణంలో ఘన నివాళులర్పించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించారు.

అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ధైర్యశాలి అని, ఆమె స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఆమె ఆశయాన్ని నెరవేర్చేందుకు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని ప్రకటించారు. ప్రతి మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.