భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారతి నగర్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పంకజ్ ని కలిశారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ని కలిసి, ఎల్.ఐ.జి, ఎం.ఐ.జి కాలనీలలో రూ.2 కోట్లు విలువైన సీసీ రోడ్ల నిర్మాణం, అన్నమయ్య ఎన్‌క్లేవ్‌లో సెంట్రల్ మీడియన్ నిర్మాణం, మాక్ సొసైటీ ఎం.ఐ.జి అన్నమయ్య కాలనీలలో రూ.1 కోటి వ్యయంతో పార్క్ అభివృద్ధి, అలాగే ఎల్.ఐ.జి, మాక్ సొసైటీలలో రూ.1 కోటి విలువైన నీటి డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాదనలను సమర్పించారు. మొత్తం రూ.4 కోట్ల అంచనా వ్యయంతో సిద్ధమైన ఈ ప్రతిపాదనలను కమిషనర్ వెంటనే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కి ఆమోద ప్రక్రియ కోసం ఫార్వర్డ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పంకజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పై ప్రతిపాదనలను అత్యవసరంగా ప్రాసెస్ చేసి కమిషనర్ కార్యాలయానికి పంపించాలని కోరారు. అదేవిధంగా ఎల్.ఐ.జి, మాక్ సొసైటీ, ఎం.ఐ.జి కాలనీలలో కొత్త ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన అన్ని పనులు త్వరితగతిన ఆమోదం పొందేలా కృషి కొనసాగుతుందని కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్