భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ద్రోణపురి వీరాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా రథోత్సవం

13

భారత్ సమాచా, నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలోని పాతపేటలో వెలసిన శ్రీ ద్రోణపురి వీరాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తుల నిండిన మధ్య ఆలయ ప్రాంగణం భక్తిరసంతో కళకళలాడింది. పూజా కార్యక్రమాల్లో భాగంగా జరిగిన రథోత్సవం అత్యంత వైభవంగా, భక్తుల ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా పూర్తయింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.