భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామం కచ్చిరుపారంలో గుర్తుతెలియని వివాహిత మృతదేహం గురువారం లభ్యమయింది. సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగి చీర కట్టుకొని ఉంది. ముఖం మొత్తం దెబ్బలతో పోల్చలేని విధంగా ఉంది. విషయం తెలిసిన నౌపడ ఎస్సై నారాయణస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహానికి రక్తం కారే గాయాలు ఉండడంతో హత్యగా పలువురు అనుమానిస్తున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్