భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

షేక్ అర్షియా జన్మదిన వేడుకలో మంత్రి ఫరూక్

076d55c6-2ce2-4761-acb8-67b2d84bcdb6

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలోని 19వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) కుమార్తె షేక్ అర్షియా జన్మదిన వేడుకలు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. మంత్రి ఫరూక్, ఫిరోజ్ కలిసి అర్షియా చేత కేక్ కట్ చేయించి, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అర్షియాకు భవిష్యత్తులో మంచి విద్య, ఆయురారోగ్యాలు కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈ వేడుకలకు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు భారీగా హాజరై అర్షియాకు ఆశీర్వాదాలు అందించారు.