భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయ హాజరై మత్స్యకారుల సంక్షేమం, ఉత్పత్తి పెంపు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపు అంశాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి. హీరానాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి తనయుడు ఫిరోజ్, జిల్లా కోఆపరేటివ్ అధికారి రామాంజనేయులు, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున, నంద్యాల జిల్లా బెస్త సంఘం అధ్యక్షులు వై.వి. సుబ్బయ్య, రాష్ట్ర బెస్త సంఘం ప్రధాన కార్యదర్శి రమణయ్య, గౌరవాధ్యక్షులు మార్కెట్ ప్రసాద్, మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్