భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

స్ట్రీట్ లైట్ సమస్య ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

WhatsApp Image 2025-11-22 at 4.07.47 PM

భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు : నంద్యాల పట్టణం 4వ వార్డులోని కాళి కాంబ గుడి, జండా చెట్టు ప్రాంతంలో కరెంటు స్తంభం లేకపోవడంతో స్ట్రీట్ లైట్ సమస్య ఏర్పడింది. కర్ర సాయంతో దీపాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని స్థానికులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారం కోసం ఎస్‌.డి.పి.ఐ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. 4వ వార్డు బ్రాంచ్ నాయకులు ఆత్మకూర్ బస్టాండ్ సమీపంలోని కరెంటు ఆఫీస్‌లో ఏఈ బి.నాగరాజుకి మెమోరాండం సమర్పించారు.

 

దీనిపై స్పందించిన ఏఈ స్ట్రీట్‌లైట్ అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ 4వ వార్డు నాయకులు జమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షేక్ అలీం, షేక్ సద్దాం, షేక్ ఇబ్రహీం, మొహమ్మద్ అలీ, అలాగే పాన్ పట్టి సద్దాం తదితరులు పాల్గొన్నారు.