భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: తెలుగుపేటలోని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. బీరువాలో బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని గుర్తించారు. సుమారు పావుకేజీ వెండి, బంగారం, ₹50,000 నగదు మాయం అయినట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు. వన్‌టౌన్ పోలీసులను సమాచారం అందించగా, క్లూస్ టీమ్ వచ్చి విచారణ చేపట్టింది. బీరువా తాళం దొంగలకు ముందుగానే తెలిసినట్టు ఉండటం వల్ల, పరిచయస్తుల ప్రమేయం ఉందా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
BHARATH SAMACHAR DIGITAL
23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్