భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

నంద్యాలలో ‘రైతన్న మీకోసం’ ప్రారంభం

29

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రైతుల అభివృద్ధి లక్ష్యంగా నంద్యాల మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ప్రసాద రావు నేతృత్వంలో వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 24 నుంచి 29 వరకు రైతు కుటుంబాలను ప్రత్యక్షంగా కలసి పంటల వివరాలు, సాగు విధానాలు సేకరించి రబి–2025, ఖరీఫ్–2026, రబి–2026 కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రసాద రావు తెలిపారు. కార్యక్రమానికి రైతులు చురుకుగా స్పందించి సహకరించాలని ఆయన కోరారు.