భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అండ: మంత్రి

WhatsApp Image 2025-11-24 at 3.53.06 PM

భారత్ సమాచార్.నెట్, నంద్యాల: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పూర్తి అండగా ఉంటుందని, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా పోలూరులో ఆయన రైతుల ఇంటి వద్దకు వెళ్లి అవగాహన పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు తెలుసుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పంచ సూత్రాల విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ పంచ సూత్రాలలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.