భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

రైతుల మేలుకోసమే ‘రైతన్నా… మీ కోసం’

16

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నందికొట్కూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నివాసంలో ‘రైతన్నా… మీ కోసం’ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం నారా చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, మెకనైజేషన్, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడి సాయం వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. నవంబర్ 24 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతన్నా–మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసే దిశగా ఉమ్మడి ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాలు,నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు,రైతుల జీవితాల్లో పెనుమార్పులు తేవనున్నాయని ఎంపీ శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, రైల్వే జోనల్ యూజర్ కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు, రైతులు చంద్రుడు, శివ, కరీం, సత్యం రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.