భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్

24

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల మండలం గుంతనాల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పాంప్లెట్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు. ప్రతి రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుబాటులో ఉన్న అన్ని సేవలు, సబ్సిడీలు, సహాయాలు రైతులకు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.