భారత్ సమాచార్.నెట్, నంద్యాల: వారం రోజులుగా అదృశ్యమైన బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన మైనర్ బాలిక హైదరాబాద్‌లోని ప్రభుత్వ చైల్డ్ కేర్ సెంటర్‌లో క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నంద్యాల 1-టౌన్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, ప్రయాణ వివరాలు, కాల్ డేటా ఆధారంగా బాలిక హైదరాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించి, ఆమె క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ కారణంగా ఈ కేసు విచారణ వేగవంతమైంది. బాలిక సురక్షితంగా దొరకడంతో వారం రోజులుగా ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. త్వరలో బాలికను నంద్యాలకు తీసుకొస్తామని, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు చేపడుతున్నట్లు 1-టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
BHARATH SAMACHAR DIGITAL
26, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్