భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

WhatsApp Image 2025-11-26 at 7.32.39 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నంద్యాల జిల్లా : ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం భారతీయుల స్వేచ్ఛకు, సమానత్వానికి పునాది అని, దీని రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని వివరించారు. విద్యార్థులు రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు, హక్కులు మరియు విధులను తెలుసుకోవాలని ఉద్బోధించారు.

రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఏ. రాజ్‌కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. కృష్ణ రాజ్యాంగ పరిషత్ సభ్యుల కృషిని, రాజ్యాంగం అందించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి, జాతీయ గీతాలాపనతో వేడుకలను ముగించారు.