భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

రాష్ట్రస్థాయి క్రికెట్‌లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

26

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఖమ్మం జిల్లా జట్టు ప్రతిభావంతమైన ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాధించింది.ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం–హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో తక్కువ తేడాతో మ్యాచ్ నిర్ణయించబడింది. చివరకు 6 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించగా, ఖమ్మం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయంతో జిల్లా క్రీడా రంగంలో ఉమ్మడి ఖమ్మం జట్టు మరోసారి ప్రతిభను నిరూపించిందని క్రీడాధికారులు అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లోను పినపాక మండలానికి చెందిన క్రీడాకారిణి వైష్ణవి రత్న ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు.