భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోదరుడు మంచాల సొసైటీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి సాన్నిధ్యంలో రచ్చుమర్రి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బోయ కోసిగి హనుమంతు, కోసిగి రోగప్ప, శివ, యాగంటి పాలప్ప తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల టిడిపి అధ్యక్షులు గోపాల్ రెడ్డి సమక్షంలో పంచాయతీ స్వగృహంలో వీరు టిడిపి తీర్థం స్వీకరించారు. వైసీపీలో తమకు తగిన గౌరవం, గుర్తింపు లభించకపోవడంతో పాటు “మా గ్రామం, మా మండలం అభివృద్ధి అయితే అది రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో టిడిపీ ద్వారానే సాధ్యం” అని నూతనంగా చేరిన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రచ్చుమర్రి గ్రామానికి చెందిన హుస్సేనీ, మూలింటి వెంకటేష్, బండ్రాళ్ళ నరసింహులు, పోలి శివ, లింగమయ్య, మజ్జిగ వీరేశ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
28, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్