భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.350 కోట్ల దాక కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరేందుకు పాన్ ఇండియా లెవల్లో చాలా వేగంగా దూసుకెళ్తోంది. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తోనే ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ అడల్ట్ మూవీలో హింస, అసభ్యకర డైలాగులు, న్యూడ్ సీన్ తో యువతను పిచ్చెక్కిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ డైరెక్షన్ మరింత రాటుదేలడంతో.. ఇలాంటి అగ్రెసివ్ హై ఇన్టెసిటీ మూవీస్ కు సందీప్ వెండితెరపై బ్రాండ్ గా నిలువనున్నాడు. విపరీతమైన హీరోయిజం చూపించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ టైపు హీరోయిజంతో విజయ్ దేవరకొండ.. ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే.
కాగా, యానిమల్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నా.. విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో న్యూడ్ సీన్ ను కొందరు ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు దీనిపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అయితే ఈ సీన్ చేసిన సుందరి ఎవరో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఓ సన్నివేశంలో రణబీర్ తన భార్య రష్మికను మోసం చేసి, మరో యువతి జోయాతో శారీరక సంబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ సందర్భంగా వచ్చే న్యూడ్ సీన్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ సీన్ లో నటించింది త్రిప్తి దిమ్రి. సినిమా రిలీజైన దగ్గర నుంచి ఈమె గురించి యూత్ గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. 29 ఏండ్ల త్రిప్తి ‘మామ్’, ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్ను’ వంటి చిత్రాల్లో వెండితెరపై మెరిసింది. వాటితో అంతంత మాత్రమే పేరు వచ్చిన త్రిప్తి.. యానిమల్ లో బోల్డ్ గా నటించడంతో ఇక బాలీవుడ్ లో పెద్ద పెద్ద అవకాశాలు తలుపులు తట్టే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
మరికొన్ని కథనాలు…
సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్