భారత్ సమాచార్, జాతీయం: బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం సాధించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ప్రశాంత్ కిశోర్ 18,964 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు. 1995 నుంచి బీజేపీ ఓటమి ఎరుగని బాంకీపూర్‌లో ఈ ఫలితం కమల దళానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. గత ఎన్నికల్లో 50 వేలకుపైగా మెజార్టీతో గెలిచిన బీజేపీ…