భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వేలాదిమంది మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై ప్రముఖులచే ఉపన్యాసాలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..…