భారత్ సమాచార్: ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ సంస్థ అంధులకు చూపు తిరిగి అందించే లక్ష్యంతో ‘బ్లైండ్సైట్’ (Blindsight) అనే అత్యాధునిక మెదడు ఇంప్లాంట్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా చూపు కోల్పోయిన వారికి కూడా భవిష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా దృష్టి పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
ఈ సాంకేతికతలో దెబ్బతిన్న కళ్లపై ఆధారపడకుండా నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్కు సంకేతాలను పంపించే విధంగా చిప్ పనిచేస్తుంది. సాధారణంగా కళ్ల ద్వారా అందే దృశ్య సమాచారాన్ని…


