భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: సృష్టిలోని సమస్త జీవుల మనుగడకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి కనీస బాధ్యత అని నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తండాలో సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ సామగ్రి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామస్థులకు సూచించారు. వరి, మొక్కజొన్న వంటి పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాయు…