భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తోడు కోసం మగ పెద్దపులి మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలలో సంచరిస్తుంది. జోడి కోసం వెతుకుతున్న ఈ మగ పులి నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతం వైపు వచ్చే అవకాశాలు ఉండటంతో పెద్దపులి కదలికలను గమనించేందుకు కమ్మర్‌పల్లి అటవీశాఖ రేంజ్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మహేందర్, బీట్ ఆఫీసర్ తిరుపతి అధికారుల బృందం జిల్లా సరిహద్దుల్లో మానాల, భీమ్‌నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.