భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో వ్యక్తిగత, కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతికి గల…

